ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

ఎస్సారార్‌కు గోల్డ్‌ అవార్డు ఎఫ్‌ఏసీ డీఈవో బాధ్యతల స్వీకరణ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రణాళికాబద్ధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం నగరంలోని 1వ డివిజన్‌ ఆరెపల్లిలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్‌ రేకుర్తిలో రూ.10 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు, కార్పొరేటర్లు బారి అపర్ణ జితేందర్‌, సుధగోని మాధవి కృష్ణ గౌడ్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ సిటీ: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించిన భారత్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం సస్టైనబుల్‌ క్యాంపస్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ అవార్డ్స్‌–2026లో నగరంలోని ఎస్సారార్‌ కళాశాల ప్ర తిష్టాత్మక గోల్డ్‌ సస్టైనబుల్‌ క్యాంపస్‌ అవార్డు గెలుచుకుంది. కళాశాల వృక్షశాస్త్ర విభాగా ధిపతి తిరుకోవెల శ్రీనివాస్‌ స్వీకరించారు. కళా శాలలో పర్యావరణ పరిరక్షణ, హరితహారం, సీడ్‌బాల్‌ ఉద్యమం, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పచ్చదనం అభివద్ధి వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్‌ డా.రామకృష్ణ తెలిపారు.

కరీంనగర్‌ టౌన్‌: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బదిలీపై వచ్చిన ప్రశాంత్‌ రెడ్డి సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) స్వీకరించారు. భువనగిరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ప్రశాంత్‌రెడ్డి విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ డీఈవో హోదాలో అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానా జీ వాకడే నుంచి డీఈవో ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ ను స్వీకరించారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్‌.ప్రశాంత్‌రెడ్డిని తెలంగాణ గెజిటెడ్‌ హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌ (టీజీహెచ్‌ఎంఏ) జిల్లా అధ్యక్షుడు పోలా డి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి, రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

కొనసాగుతున్న పీఈసెట్‌ ప్రవేశ పరీక్షలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీపీఈసెట్‌)– 2026 ఉత్సాహంగా సాగుతోంది. సోమవారం నాటికి పురుష అభ్యర్థులకు శారీరక పరీక్షలు ముగిశాయి. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగనున్నాయి. మంగళవారం 656 మందికి ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఉద యం పరీక్షలు తీరును శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌ కుమార్‌ పరీశీలించారు. సోమవారం పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించినట్లు టీజీపీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. బీపీఈడీ కోర్సుకు 701 దరఖాస్తులు రాగా.. 529 మంది ప్రవేశ పరీక్షలో పాల్గొన్నారని, 172 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. డిప్లొమా వ్యాయామ విద్యలో 306 మంది దరఖాస్తు చేసుకోగా 211 మంది పరీక్షలకు హాజరవుగా 95 మంది గైర్హాజరయ్యారని తెలిపారు

సర్టిఫికెట్ల పరిశీలన

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడుత ధ్రువపత్రాల పరిశీలన సోమవారంతో ముగిసింది. చివరి రోజు స్లాట్‌ బుక్‌ చేసుకున్న 363 మంది సర్టిఫికెట్లు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్‌ శోభారా ణి తెలిపారు. మొత్తంగా 1,282 మంది ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్నట్లు పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న వారు తప్పనిసరిగా ఇంటర్‌నెట్‌లో ఆప్షన్‌ ఎక్సర్‌సైజ్‌ చేసుకోవాలని, జూన్‌ 3 చివరి తేదీ అని, సీట్ల కేటా యింపు 6న ఉంటుందన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ నివేదన 6 నుంచి 9వరకు, కళాశాలలో రిపోర్టింగ్‌ జూన్‌ 8, 9 తేదీల్లో చేయాలన్నారు. జూన్‌ 8నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement