భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..? | - | Sakshi
Sakshi News home page

భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..?

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..?

కరీంనగర్‌ టౌన్‌: పోక్సోకేసు నమోదైన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ డం లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్‌లో మాట్లాడుతూ భగీరథ్‌ పరారీలో ఉన్నడని చెబుతుంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం, ఐబీ, స్పెషల్‌ బ్రాంచ్‌లు ఏం చేస్తున్నాయని నిలదీశారు. సాధారణ వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదైతే వెంటనే అరెస్ట్‌ చేసే పోలీసులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావడంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకా రం సమాచారం దాచిపెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ కేసులో బండి సంజయ్‌, ఆయన పీఆర్వోపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు రూ.50 వేలు ఇచ్చి నట్లు నగరంలోని టూ టౌన్‌లో ఫిర్యాదు చేయ డం ద్వారా అసలు కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బండి సంజయ్‌ మాటపై నిలబడాలంటే, ముందుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఉచిత పీజీ ఎంట్రెన్స్‌ కోచింగ్‌

కరీంనగర్‌ సిటీ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఎస్సారార్‌ కళాశాల కామర్స్‌ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉచిత ఎంకాం పీజీ ఎంట్రెన్స్‌ కోచింగ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 40రోజుల పాటు కొనసాగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, కామర్స్‌ నిపుణులు విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు అవసరమైన పరిజ్ఞానం, మోడల్‌ పరీక్షలు, ప్రశ్నాపత్ర విశ్లేషణ, సమయ నిర్వహణ, పరీక్ష వ్యూహాలపై సమగ్ర శిక్షణ అందిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. కన్వీనర్‌ బూర్ల నరేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌ , కామర్స్‌ విభాగాధిపతి టి.రాజయ్య, కో–కన్వీనర్‌ అర్జున్‌ పాల్గొన్నారు.

16న జాబ్‌మేళా

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీ కరీంనగర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ నివాబూపాలో 25 ఖాళీల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 25ఏళ్లు పైబడి ఉండాలని తెలిపారు. వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఈ సేవ కేంద్రం పైఅంతస్తుకు రావాలని, బయోడేటాతో పాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 99082 30384, 99633 57250 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అనుమతి లేని అకాడమీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఐ ఈవో ఆంజనేయరావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కొన్ని అకాడమీ లు, కోచింగ్‌ సెంటర్లు తమకు ఇంటర్‌ బోర్డు అనుమతి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ, విద్యార్థులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకాశ్‌, బన్సల్‌క్లాసెస్‌ వంటి సంస్థలు అకాడమీలు మాత్రమేనని, గుర్తింపు పొందిన ఇంటర్‌ బోర్డు కళాశాలలు కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఐఐటీ, నీట్‌, ఏప్‌సెట్‌ అకాడమీలూ ఇంటర్‌ బోర్డు కిందికి రావన్నారు. అడ్మిషన్‌ తీసుకునే ముందు కళాశాల పేరు, అనుమతి పొందిన చిరునామా, గ్రూపులు, అర్హత గల అధ్యాపకులు, ల్యాబ్‌ సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేయాలని, ప్రతి కళాశాల ఎదుట వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అనుమతి లేని సంస్థల్లో చేరి విద్యార్థులు తమ భవి ష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement