శంకరపట్నం: ఇంటి నుంచి వెళ్లిన సింగరేణీ రిటైర్డ్ ఉద్యోగి మాతంగి కొంరయ్య(75) మండలంలోని కాచాపూర్ గ్రామశివారులో శవమై కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొంరయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. కుటుంబంతో కలిసి అత్తగారి ఊరు ముత్తారంలో నివాసం ఉంటున్నాడు. కొంరయ్య పెద్ద కుమారుడు ఆనంద్ ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో అదే బెంగతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం గొర్రెల కాపరులకు కాచాపూర్ శివారులో శవమై కనిపించాడు. కొడుకుపై బెంగతోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.


