బన్నీ వేసవి యాత్ర–5 రామ్‌ డాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర–5 రామ్‌ డాన్స్‌

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

బన్నీ వేసవి యాత్ర–5 రామ్‌ డాన్స్‌

సాయంత్రం అయ్యింది.

బస్‌ ఒక ఊర్లో ఆగింది.

ఇది బస్‌ స్టాండ్‌.

అక్కడ చాలా మంది.

మధ్యలో ఒక అబ్బాయి.

పేరు రామ్‌. వయసు 11.

పక్కన ఒక తాత డప్పు కొడుతున్నాడు.

‘డమ్‌ డమ్‌’ అని శబ్దం.

రామ్‌ డాన్స్‌ చేస్తున్నాడు.

గెంతుతున్నాడు. తిరుగుతున్నాడు.

అందరూ చూస్తున్నారు.

చప్పట్లు కొడుతున్నారు.

రామ్‌ బన్నీని చూశాడు.

‘ఏయ్‌ బాబూ! రా!’ అన్నాడు.

‘నాకు డాన్స్‌ రాదు’ అన్నాడు బన్నీ.

సిగ్గు పడ్డాడు.

రామ్‌ నవ్వాడు.

బన్నీ చెయ్యి పట్టుకున్నాడు.

మధ్యలోకి లాగాడు.

‘డాన్స్‌ రాకున్నా పర్లేదు. చిన్నగా మొదలు పెట్టు. ఆనందం చాలు’ అన్నాడు రామ్‌.

బన్నీ రెండు గెంతులు గెంతాడు.

చెయ్యి ఊపాడు. కాలు కదిపాడు.

తప్పు అయ్యింది. అయినా పర్లేదు.

అందరూ ‘భలే!’ అన్నారు.

చప్పట్లు కొట్టారు.

బన్నీకి నవ్వు వచ్చింది.

గుండె హాయిగా ఉంది.

బస్‌ ‘పాం పాం’ అని అరిచింది.

బన్నీ బస్‌ ఎక్కాడు.

రామ్‌ చెయ్యి ఊపాడు. ‘బై!’ అన్నాడు.

పిల్లలకి మాట:

డాన్స్‌ రావాల్సిన పని లేదు.

మనసులో ఆనందం ఉంటే చాలు.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి,

మండలం: మంథని,

పెద్దపల్లి జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement