నిజాయతీ ఫలం | - | Sakshi
Sakshi News home page

నిజాయతీ ఫలం

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

నిజాయతీ ఫలం

ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఒక రోజు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. రాము ఆ పర్సును తీసుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్ద ఆ పర్సు ఎవరిదో తెలుసుకోవడానికి గ్రామంలో ప్రకటించాడు. కొంతసేపటికి ఒక వృద్ధుడు వచ్చి అది తనదేనని చెప్పాడు. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు, ఎందుకంటే ఆ డబ్బుతో తన కుమార్తె చదువు ఫీజు చెల్లించాల్సి ఉంది. రాము పర్సును అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో రామును ఆశీర్వదించి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ రాము శ్ఙ్రీనిజాయితీకి బహుమతి అవసరం లేదుశ్రీశ్రీ అన్నాడు. రాము మంచితనాన్ని చూసి గ్రామస్థులందరూ అతన్ని ప్రశంసించారు. అప్పటి నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

పేరు: నక్క శ్రీకర్‌, గ్రామం: ఊటూరు, మండలం: మానకొండూర్‌, జిల్లా: కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement