సుల్తానాబాద్‌ ‘అల్ఫోర్స్‌’కు సీబీఎస్‌ఈ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సుల్తానాబాద్‌ ‘అల్ఫోర్స్‌’కు సీబీఎస్‌ఈ గుర్తింపు

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని అల్ఫోర్స్‌కు సీబీఎస్‌ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి అన్నారు. అల్ఫోర్స్‌కు సీబీఎస్‌ఈ గుర్తింపు రావడంతో సుల్తానాబాద్‌లోని అల్ఫోర్స్‌ హైస్కూల్‌లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లుగా అన్నివర్గాల విద్యార్థులకు తమ సంస్థ విద్యా సేవలు అందిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని గుర్తింపు ఇచ్చారని అన్నారు. విద్యార్థులకు ప్రాథమికదశ నుంచే నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సీబీఎస్‌ఈ గుర్తింపు ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయని, ఐఐటీ, నీట్‌లో సులభంగా సీట్లు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల సీబీఎస్‌ఈ గుర్తింపు నంబర్‌ 3630668గా ఉందని ఆయన చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల సిబ్బంది నరేందర్‌రెడ్డిని సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement