సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12నుంచి జూన్ వరకు ఉమ్మడి జిల్లా క్రికెట్ సెలెక్షన్స్‌కు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు డీసీసీ చైర్మన్ వంకాయల కార్తీక్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బాలబాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు వైట్ డ్రెస్‌తో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు.


