లైఫ్‌ డోనర్స్‌ | - | Sakshi
Sakshi News home page

లైఫ్‌ డోనర్స్‌

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

లైఫ్‌ డోనర్స్‌ ● చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే సత్యం ● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత – వివరాలు 8లోu

వైద్యులకు దీటుగా రోగులకు సేవలు

భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు

నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం

నర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్‌ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

– కరీంనగర్‌/కోల్‌సిటీ(రామగుండం)

తూకంలో దోపిడీ తగదు

కరీంనగర్‌అర్బన్‌: కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ తూకం వేయడం, తరుగు పేరిట మిల్లర్లు దోచుకోవడం వంటి చర్యలను తక్షణమే నియంత్రించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్‌ చిత్రామిశ్రాను కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు, స్టోరేజ్‌ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ వివరించారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు.

మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోండి

రైస్‌ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లు, రవాణా దా రుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలమన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఎక్కువమంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంత రం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా పౌరసరఫర ాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రజనీకాంత్‌, డీఆర్డీవో శ్రీధర్‌, డీసీవో రామానుజచారి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement