కరీంనగర్‌అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాస్థాయిలో కలెక్టర్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో కుందారపు మహేశ్వర్ వినతులను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపగా, ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మొత్తం 129 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా, అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజన్‌కు 40, హుజురాబాద్ డివిజన్‌కు 16 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్లోనే..
మొత్తం అర్జీలు: 129
మునిసిపల్ కార్పొరేషన్: 23
ఎస్సీ వెల్ఫేర్: 11, హౌజింగ్: 11
సీపీ ఆఫీస్: 06, వారధి: 06


