యానిమల్‌ హౌస్‌తో పరిశోధనలకు ఆస్కారం | - | Sakshi
Sakshi News home page

యానిమల్‌ హౌస్‌తో పరిశోధనలకు ఆస్కారం

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కరీంనగర్‌సిటీ: శాతవాహన ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాలలో సోమవారం ‘యానిమల్‌ హౌస్‌’ను వీసీ ఉమేశ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతువులకు ఆశ్రయం కల్పించి, వాటి సంరక్షణ, ఫ్రీ క్లినికల్‌ రీసెర్చ్‌ చేయడానికి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రార్‌ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ, పరిశోధనలో భాగంగా ఫార్మ కాలేజీకి జంతుశాల వెన్నెముక వంటిదని, పరిశోధనలతో మరింత ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.శ్రీశైలం, సీడీసీ డీన్‌ డా.జాఫర్‌, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్‌మున్వర్‌, అధ్యాపకులు డా.క్రాంతి, డా.అనిల్‌ డా.భాగ్యలక్ష్మి, డా.శ్రీవిద్య, డా. అశ్విని, డా.అర్చన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement