వేసవిలో చిన్నారులు భ​‍​ధ్రం | - | Sakshi
Sakshi News home page

వేసవిలో చిన్నారులు భ​‍​ధ్రం

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు

ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ

వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్‌, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు

కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్‌, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి.

జ్యోతినగర్‌: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement