గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్‌పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్‌పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు.
ప్రాణం తీసిన గెట్‌టూగెదర్..
వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్‌క్లాస్ గెట్‌టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్‌చేస్తూ, మెసేజ్‌లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్‌చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్‌ద్వారా నవీన్‌కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్‌తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్‌తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్‌లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య
వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్
ముగ్గురు నిందితుల అరెస్ట్


