కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి(వట్టిమల్ల) లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గొల్లపల్లికి చెందిన గోపు లచ్చయ్య(65) ఆదివారం బంధువుల వివాహానికి వెళ్లి వచ్చి, సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వేములవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
రైల్వే ఉద్యోగిపై కోతుల దాడి
● తలకు, ముక్కు, కన్నుకు తీవ్రగాయాలు
రామగుండం: పెద్దపల్లి జి ల్లా రామగుండం రైల్వేక్వార్టర్లలో కోతులు బీభత్సం సృష్సిఉ్తన్నాయి. ఈ నేప థ్యంలోనే స్థానిక రైల్వే సీ అండ్ డబ్ల్యూ సహాయకు డు రవికిషన్ విధులు ముగించుకుని ఆదివారం రాత్రి తన క్వార్టర్‌కు చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు డోర్ తీసి బయటకు రాగానే కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసేందుకు య త్నించాయి. వాటిని తప్పించు కునేందుకు రవి కిషన్ ఇంట్లోకి పరుగెత్తినా వెంటాడి దాడి చేశా యి. ఘటనలో ముఖం, ము క్కు, కంటిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో స్థానికు లు భయాందోళనలకు గురవుతున్నారు.
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాళ్ల రాజు(34) తన భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజుకు భార్య రజిత, ఇద్దరు కొడుకులున్నారు. రాజు మద్యానికి బానిస కావడంతో భార్యతో రోజూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన భార్య ఆర్నెల్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. తన ఇంటికి రావాలని ఎంతపిలిచినా రాలేదు. మరింత మద్యానికి బానిసైన రాజు.. మనస్థాపంతో ఆదివారం మద్యం తాగాడు. ఆ మత్తులో తాను ఉరివేసుకుని చనిపోతున్నని తన చిన్నఅక్కకు ఫోన్ చేసి చెప్పాడు. భయపడిన ఆమె వెంటనే ఇంటిపక్కన ఉన్న బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లిచూసేసరికే ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. అక్క లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
వడదెబ్బతో వృద్ధురాలు మృతి
వీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూలం వెంకటమ్మ(70) వడదెబ్బకు గురై మృతి చెందింది. వెంకటమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. సోమవారం పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


