జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్‌కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి
అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు


