నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను.
– శోభ, డిప్యూటీ నర్సింగ్
సూపరింటెండెంట్, కరీంనగర్
రోగులను కాపాడడంలోనే సంతృప్తి
రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
– దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్
నర్స్ పాత్ర గొప్పది
రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్‌ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్
సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి


