కంచర్లలో చిరుత కలకలం | - | Sakshi
Sakshi News home page

కంచర్లలో చిరుత కలకలం

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

● దాడిలో గేదె మృతి

● దాడిలో గేదె మృతి

వీర్నపల్లి: కంచర్ల గ్రామంలో చిరుత పులి దాడి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు, మంత్రి శ్రీనివాస్‌కు చెందిన పాడి గేదైపె చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే శ్రీనివాస్‌కు చెందిన గేదె తోటి గేదెలతో మేతకెళ్లగా.. అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం తన గేదె కోసం అడవిలో గాలించగా.. గేదె చిరుత దాడిలో అక్కడికక్కడే మృతిచెందడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం నుంచి సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. గ్రామ సమీపంలోనే చిరుత సంచరిస్తుండడంతో కంచర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు.

పెద్దమ్మ ఆలయంలో చోరీ

మల్లాపూర్‌: సిరిపూర్‌ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ప్రతి ఏటా ముదిరాజ్‌ కులస్తులతోపాటు ఇతర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఆలయ గర్భగుడి తాళం పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, ముక్కెర, బొట్టు, వెండి మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఎస్సై అనిల్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో వెళ్లి విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ ఫుటేజీ చూడగా.. దుండగుడు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యం రికార్డయింది. ముదిరాజ్‌ కులస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement