● తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడి తరలింపు
వేములవాడ: భగవంతరావునగర్‌కు చెందిన ఊరడి భూమయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పట్టణంలోని పెద్దమ్మ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వేములవాడ రూరల్ పరిధిలో తన పర్యటన ముగించుకొని వేములవాడ వస్తున్న క్రమంలో ఇది చూసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమయ్యను పరామర్శించి రోడ్డు ప్రమాద వివరాలడిగి తెలుసుకున్నారు. వెంటనే తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


