ప్రతీ సబ్జెక్టుల్లో ఉత్తమ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నాం. నాలుగేళ్లుగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం. పోటీపరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు మెరుగైన మెటీరియల్‌తోపాటు మెడిటేషన్ చేయిస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ తర్వాత జాతీయ గీతాలాపన చేయిస్తున్నాం. పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగావకాశాలను విద్యార్థులకు వివరిస్తున్నాం.
– గోశికొండ బాలరాజు, సత్యసాయి సమితి జిల్లా
యువజన సమన్వయకర్త


