నేటి నుంచి పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడా శిబిరాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: విద్యార్థుల వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నేటి నుంచి ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ పాఠశాలల్లో విజ్ఞాన, క్రీడా శిబిరాల కోసం ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.50వేలు కేటాయించింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న 17 పాఠశాలలకు రూ.8లక్షలు, జగిత్యాలలోని 15 పాఠశాలలకు రూ. 7.5లక్షలు, రాజన్న సిరిసిల్లలోని 9 పాఠశాలలకు రూ.4.5లక్షలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 8 పాఠశాలలకు రూ.4లక్షలు కేటా యించారు. పీఎంశ్రీతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ ఈ క్యాంప్‌ల్లో అవకాశం కల్పించనున్నారు.


