అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం | - | Sakshi
Sakshi News home page

అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్‌. తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్‌ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్‌ చెబుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement