ముత్తారం: బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీశారని ఆరోపించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


