● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్
కరీంనగర్‌రూరల్: రైతులు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవ డం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్ అన్నారు. గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా దుర్శేడ్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకంలో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించిందన్నారు. సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చని తెలిపారు. డీఈ రాజం, ఏఈ ప్రదీప్‌రెడ్డి, ఏవో సత్యం, ఏఈవో స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.


