ఇసుక లారీలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీణవంక మండలం కొండపాక గ్రామ మానేరు వాగు శివారులో రెండు ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడ ఇసుక నింపుకొని హిమ్మత్‌నగర్ గ్రామం మీదుగా రెడ్డిపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో రెడ్డిపల్లి గ్రామ మూలమలుపు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. లారీ డ్రైవర్లు ఒకరి కంటే మరొకరు పోటీపడి రోడ్డుకు ఇరువైపులా నిలపడం కూడా సమస్యగా మారింది. వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ వెనుక రోడ్డు ప్రమాదకరంగా ఉంది. జనం రద్దీగా ఉండే ఈ ఏరియాలో లారీల ఓవర్ స్పీడ్‌తో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.
– వీణవంక


