కరీంనగర్‌టౌన్: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ ఈనెల 9న శనివారం కరీంనగర్ బంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని... ఈ ఘటనతో కరీంనగర్ పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందన్న విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని కరీంనగర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నామని కరీంనగర్ నగర ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.


