ఏఎంసీ రేటు రూ.3.50 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీ రేటు రూ.3.50 కోట్లు

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

● మాజీ ఎంపీపీ సుదగోని లక్ష్మీనారాయణగౌడ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి విలువ రూ.3.50 కోట్లు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీపీ సుదగోని లక్ష్మీనారాయణగౌడ్‌ సంచలన ఆ రోపణలు చేశారు. ఏఎంసీ చైర్మన్‌ విషయంలో జరిగిన అన్యాయానికి నిరసనగా, తనకు ఇచ్చిన వైస్‌ చైర్మన్‌, మానకొండూరు బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో మాట్లాడారు. 35 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తనకు ఏఎంసీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యానారాయణ, మే డిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశం, అర్బన్‌ బ్యాంక్‌చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, అర్బన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ సిఫారసు చేశారని, కానీ, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆకుల నర్సయ్యకు వెలిచాల రాజేందర్‌రావు పదవి కట్టబెట్టారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమసయంలో రూ.3 కోట్లు, ఏఎంసీ చైర్మన్‌ కోసం రూ.50 లక్షలు మొత్తం రూ.3.50 కోట్లు ఇచ్చారనే ఆయనకు చైర్మన్‌ పదవి ఇచ్చారని విమర్శించారు. డైరెక్టర్లుగా నియమించిన వారిలో కేవలం ఒక్కరు మా త్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారని, పార్టీతో సంబంధం లేని ఇతర పార్టీ నాయకులకు డైరెక్టర్‌ పదవులు ఇచ్చారని ఆవేదన చెందారు. వెలిచాల రాజేందర్‌రావును అసెంబ్లీ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పిస్తేనే కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ జోక్యం చేసుకొని ఏఎంసీ కమిటీని రద్దు చేసి, పార్టీకి కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలతో కొత్తగా కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రెడ్డిగాని రాజు, బుర్ర కనుకయ్యగౌడ్‌, తిరుపతి, కిరణ్‌, తిరుపతిరెడ్డి, వరాల అనిల్‌, రాజమల్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement