● రక్షణ కోసం ప్రజావాణిలో తల్లి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్‌పల్లికి చెందిన దాసరి అరవింద్ (23) ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ ఎడారిలో గొర్రెల కాపరిగా అష్టకష్టాలు పడుతున్నాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగమని చెప్పి రూ. 90 వేలు తీసుకున్న ఏజెంట్ అతడిని ఎడారిలో వదిలేశాడు. కనీస వసతులు, తిండి లేక అరవింద్ పడుతున్న కష్టాల వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డి.. బాధితుడిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి, మోసం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నారై విభాగం అధికారులను, జగిత్యాల ఎస్పీని ఆదేశించారు.


