మొక్కజొన్న పంట దగ్థం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పంట దగ్థం

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కౌలు రైతు గోపు శ్రీనివాస్‌ కు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. పొరుగు రైతు కొయ్యకాలుకు నిప్పంటించడంతో నిప్పులు ఎగిరిపడి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మొక్కజొన్న పంట కాలిపోయింది. సుమారు ఎకరన్నర పంట మంటల్లో కాలిబూడిదైనట్లు, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు రోదించాడు.

గంజాయి విక్రేత రిమాండ్‌

సిరిసిల్ల అర్బన్‌: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు. వేములవాడకు చెందిన భరత్‌కుమార్‌ తంగళ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో స్థానిక ఎస్సై ఉపేంద్రచారి తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు. అతని వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement