క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు.. | - | Sakshi
Sakshi News home page

క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు..

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు..

ఐపీఎల్‌ మ్యాచ్‌లను టీవీల్లో చూస్తున్న చిన్నారులు తమను తాము విరాట్‌ కోహ్లి.. రోహిత్‌శర్మ.. ఇషాన్‌ కిషన్‌.. మార్ష్‌.. బుమ్రాలా పోల్చుకుంటూ గల్లీల్లో క్రికెట్‌ ఆడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ మైదానానికి బ్యాట్లు, గ్లౌజ్‌లు, హెల్మెట్లు, ప్యాడ్లతో వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు క్రికెట్‌ శిక్షణ శిబిరం సాగుతోంది. 35 మంది విద్యార్థులు ప్రస్తుతం శిక్షణ పొందుతుండగా.. మరింత మంది వచ్చేందుకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు.

సిరిసిల్లలో క్రికెట్‌ క్యాంపు వేసవి సెలవుల్లో శిక్షణ ఉదయం.. సాయంత్రం ప్రాక్టీస్‌

సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానంలో క్రికెట్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌

సిరిసిల్ల: ఇన్నాళ్లు పుస్తకాల బ్యాగులు.. టిఫిన్‌ బాక్స్‌లతో కనిపించిన చిన్నారులు సెలువులు మొదలుకావడంతో ఇష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. చేతిలో బ్యాట్లు.. కాళ్లకు ప్యాడ్లతో ప్రొఫెషనల్‌ క్రికెటర్లను మరిపించేలా శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లలో ట్రెయినింగ్‌ పొందుతున్నారు. సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానంలో క్రికెట్‌ శిబిరం కొనసాగుతోంది. చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతున్న క్రికెట్‌ శిక్షణ శిబిరంపై సాక్షి కథనం.

Advertisement
 
Advertisement
Advertisement