ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతి

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

జూలపల్లి: పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌లో సైకిల్‌పై వెళ్తున్న సుంకె గంగయ్య(64) ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఎస్సై సనత్‌ కుమార్‌ కథనం ప్రకారం.. గంగయ్య (64) గురువారం బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆకుల సందీప్‌ ద్విచక్రవాహనంతో అతివేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో గంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత పెద్దపల్లి, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి అల్లుడు మార్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

గుర్తు తెలియని వ్యక్తి..

జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఓ వ్యక్తి(40) మృతి చెంది కనిపించాడని టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పదిహేను రోజులుగా లేబర్‌ పనులు చేసుకుంటూ, స్థానిక రైల్వేస్టేషన్‌ ఏరియాలో ఉంటున్నాడని పేర్కొన్నారు. వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిఓ భద్రపరిచామన్నారు. బంధువులెవరైనా ఉంటే జమ్మికుంట టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

బైక్‌ను ఢీకొని ఒకరు..

సిరిసిల్ల: కారుతో అతివేగంగా బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సిరిసిల్ల రెండో బైపాస్‌రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌కు చెందిన అలువాల అంజయ్య(62) సిమెంట్‌ బ్రిక్స్‌ వ్యాపారం చేస్తుండేవాడు. శుక్రవారం అదే పనిపై బయటకు వెళ్లాడు. స్థానిక రగుడు చౌరస్తా సమీపంలో డివైడర్‌ నుంచి యూటర్న్‌ తీసుకుంటుండగా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి దేవరాజు కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో బైక్‌పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వరదకాలువలో గుర్తు తెలియని మృతదేహం

మల్యాల: మల్యాల మండలం నూకపల్లి శివారులోని వరదకాలువలో నీటిపై తేలియాడుతూ గుర్తు తెలియని శవం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సీఐ నీలం 8712656818, ఎస్సై నరేశ్‌కుమార్‌ 8712656830 నంబర్‌లో సంప్రదించాలని ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement