యంగ్‌ ఇండియా సమ్మర్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా సమ్మర్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

యంగ్‌ ఇండియా సమ్మర్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌ ● రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహణ ● ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ

● రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహణ ● ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ

కరీంనగర్‌స్పోర్ట్స్‌: వేసవి సెలవుల్లో విద్యార్థులను క్రీడల వైపు మళ్లించి, వారిలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) క్రీడా శిబిరాలకు శ్రీకారం చుట్టింది. సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్స్‌– షేపింగ్‌ యంగ్‌ ఇండియా చాంపియన్స్‌–2026 పేరుతో శిబిరాలను నిర్వహించనుంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11 నుంచి ఆయా జిల్లాల కేంద్రాలు, మండల కేంద్రాల్లో శిబిరాలు ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, కరీంనగర్‌లో నగర పాలక సంస్థ, క్రీడాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో పాల్గొనే చిన్నారులకు పాలు, గుడ్డు, అరటిపండు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏయే క్రీడల్లో శిక్షణ శిబిరాలు జరుగనున్నాయి, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి.. తదితర వివరాలతో కథనం.

ఉమ్మడి జిల్లాలో నిర్వహించే క్రీడలివే..

కరీంనగర్‌: ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, చెస్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, బాక్సింగ్‌, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్‌బాల్‌, వాలీబాల్‌, యోగా, జూడో, రెజ్లింగ్‌.

రాజన్న సిరిసిల్ల: కబడ్డీ, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, కరాటే, యోగా, టేబుల్‌ టెన్నీస్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌, ఆర్చరీ, క్యారమ్‌, చెస్‌, ఖోఖో, నెట్‌బాల్‌.

పెద్దపల్లి: ఫుట్‌బాల్‌, ఖోఖో, తైక్వాండో, కబడ్డీ, వాలీబాల్‌, బాక్సింగ్‌.

జగిత్యాల: వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, తైక్వాండో, అథ్లెటిక్స్‌, కరాటే.

శిక్షణ వేళలు: ఉదయం 6 నుండి 9, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు.

రిజిస్ట్రేషన్‌:

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ( https:// satgasc. telangana. gov. in).

అర్హత: 10 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులు.

ఫీజు: ఆన్‌లైన్‌లో ఎంచుకున్న క్రీడ, వేదికను బట్టి ఫీజు వివరాలు మారుతూ ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement