● ఇంటి పర్మిషన్‌కు రూ.20 వేలు డిమాండ్
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి గురువారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ తిరుపతి తెలిపిన వివరాలు.. పొత్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పర్మిషన్ కోసం కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో ఇంటి పర్మిషన్‌కు కార్యదర్శి రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా రూ.15వేలు క్యాష్ ఇచ్చాడు. మిగతా రూ.5వేలు ఫోన్ పే చేశాడు. అయినా పర్మిషన్ ఇవ్వకుండా దరఖాస్తును కార్యదర్శి రిజెక్టు చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యదర్శి డబ్బు తీసుకుంటుండగా పట్టుకొని రిమాండ్‌కు పంపినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


