మెటీరియల్ ఉపయోగపడింది
కథలాపూర్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో శ్రీసాక్షిశ్రీ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ‘సాక్షి’ మెటీరియల్‌తో ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సులభతరంగా మెటీరియల్..
పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు ‘సాక్షి’ దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్‌ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వం, ప్రైవేట్ హైస్కూళ్లకు చెందిన అనేకమంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు ‘సాక్షి’ పదోతరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించారు.
టెన్త్ విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీమెటీరియల్
వినియోగించుకున్న విద్యార్థులు
మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి డిసెంబర్‌లో సిలబస్ పూర్తి చేశారు. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో సాక్షి మెటీరియల్ గ్రూప్‌లవారీగా చర్చించుకునేందుకు ఉపయోగపడింది. మరింత ఫోకస్ చేయడంతో సైన్స్‌లో 93 మార్కులు సాధించా. సరైన సమయంలో కీలక సబ్జెక్టుల మెటీరియల్ ఇచ్చినందుకు సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– గాజుల లిఖిత, జెడ్పీ హైస్కూల్, సిరికొండ


