పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్ల బసంత్‌నగర్‌లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో గురువారం జరిగిన పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు, కన్నాల గ్రామ సర్పంచ్ మల్క రామస్వామి ఫ్యానెల్ ఘన విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో అధ్యక్ష అభ్యర్థి రామస్వామి ప్రత్యర్థి బయ్యపు మనోహర్‌రెడ్డిపై 76 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా రమేశ్ మౌర్య, పోతుల ప్రసాద్‌పై 88ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 307 ఓట్లకు అన్నీ పోలయ్యాయి. వీటిలో ఒక పోస్టల్ బ్యాలెట్ ఉండగా 1 ఓటు చెల్లకుండా పోయింది. ఒక ఓటు మిస్సింగ్ అయింది. రామస్వామికి 167, మనోహర్‌రెడ్డికి 91 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థి నల్ల మనోహర్‌రెడ్డికి 48, ప్రధాన కార్యదర్శి జేసీబీ శ్రీనివాస్‌కు 48 ఓట్లు వచ్చాయి. ఈసందర్భంగా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడారు. కార్మికుల సమష్టి విజయమని అన్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, మనాలిఠాకూర్ సహకారంతో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి బసంత్‌నగర్‌లో విజయోత్సవ ర్యాలీ తీశారు.
ఉత్కంఠ పోరులో 76 ఓట్ల మెజార్టీతో గెలుపు


