కరీంనగర్‌రూరల్: మద్యానికి బానిసైన ఇద్దరు ఆటోడ్రైవర్లు దొంగలుగా మారి గతేడాది నుంచి దొంగతనాలకు పాల్పడుతుండగా గురువారం కరీంనగర్‌రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మకల్, చింతకుంటకు చెందిన ఆటోడ్రైవర్లు ఎండీ మహ్మద్, మహ్మద్ మెయిన్‌లు మద్యానికి బానిసై దొంగతనం చేసేందుకు ఆటోలో గతేడాది జూలైలో చొప్పదండికి వెళ్లి ఓ ఇంటి తాళం పగులకొట్టారు. బీరువా నుంచి బంగారం, వెండిని దొంగతనం చేశారు. ఈనెల 5న రాత్రి విజయ్‌నగర్‌కాలనీ, సిటిజన్‌కాలనీ, బొమ్మకల్‌లోని తాళాలు వేసి ఉన్న నాలుగిళ్లల్లో బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. కరీంనగర్‌లో కొంత బంగారం విక్రయించి జల్సా చేసిన అనంతరం మొబైల్‌ఫోన్లను నాందేడ్‌లో విక్రయించేందుకు గురువారం కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఆటోలో చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకొని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. ఇద్దరి నుంచి సుమారు 7.3 తులాల బంగారం, 90 గ్రాముల వెండి, 2 సెల్‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బంగారం విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
రూ.10లక్షల విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం


