ఉపాధ్యాయుల కృషితో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. పరీక్షలకు రెండు నెలల ముందు ఇచ్చి న సాక్షి మెటీరియల్ కటింగ్ చేసి తరగతి గదిలో విద్యార్థులందరం చర్చించుకునేవాళ్లం. గణితం, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ స్పెషల్ మెటీరియల్ మాకు మరింత ప్రోత్సాహం లభించింది. సాక్షి మెటీరియల్ వల్ల సోషల్ స్టడీస్‌లో 96 మార్కులు సాధించా.
– ఉత్కం నవిత,
జెడ్పీహైస్కూల్, చింతకుంట
ప్రతి టాపిక్ నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టతరమైన వాటిని సులభతరమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి అందించారు. తద్వారా ఫిజికల్ సైన్స్‌లో ప్రతి ప్రశ్నకూ విభిన్న కోణాల్లో సమాధానం రాసేవిధంగా విద్యార్థులకు దోహదపడింది. విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్‌తో భయం పోయింది. పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఉపయోగపడింది. – వంతడుపుల రవికుమార్,
ఫిజికల్ సైన్స్ టీచర్, జెడ్పీ హైస్కూల్, సిరికొండ
సోషల్ సబ్జెక్ట్ ఎంత చదివినా పరీక్షల వేళ ఏదో వెలితిగా ఉందని విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. తరగతి గదిలో మేం విశ్లేషించి బోధించాం. సాక్షి మెటీరియల్‌లో పట్టికల విశ్లేషణ, మ్యాప్ పాయింటింగ్ విద్యార్థులకు సలువుగా అర్థమయ్యేలా ఉంది. విద్యార్థులు వ్యాసరూప, లఘు ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాసేందుకు సహకరించింది.
– ఉశకోల విశ్వనాథం,
సోషల్ టీచర్, జెడ్పీ హైస్కూల్, చింతకుంట


