రాజస్థాన్‌ కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌ కార్మికుడి మృతి

Mar 15 2026 1:25 AM | Updated on Mar 15 2026 1:25 AM

చికిత్స పొందుతూ యువకుడి మృతి

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలోని సాయి గణేశ్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి శనివారం ప్రమాదవశాత్తు మడ్‌ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. కొత్తపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిగణేశ్‌ ఫ్యాక్టరీలో వంటపని చేసేందుకు ఇటీవల ఎల్కతుర్తి నుంచి రాజస్థాన్‌కు చెందిన రత్నేష్‌కుమార్‌(23) వచ్చాడు. శనివారం వేకువజామున మూత్ర విసర్జనకు బయటకు వచ్చి, నిద్రమత్తులో ఫ్యాక్టరీ ఎదుట ఉన్న మడ్‌ ట్యాంక్‌లో పడి చనిపోయాడు. మృతుడి తండ్రి కోమకారం ఫక్రీ ముజఫర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలికతో యువకుడికి వివాహం

శంకరపట్నం: కొత్తగట్టు గ్రామ శివారులో శనివారం మైనర్‌ బాలికతో యువకుడి వివాహం జరగగా.. పెళ్లి కుమారుడితోపాటు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌, సుల్తానాబాద్‌కు చెందిన ఓ జంట పెళ్లి కొత్తగట్టు శివారులోని ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. మైనర్‌ బాలికతో ముద్రవేణి రాజ్‌కుమార్‌(25) వివాహం జరిగిందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ కేశవపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కుమారుడు రాజ్‌కుమార్‌, తల్లిదండ్రులు సంపత్‌, శోభ, బాలిక తల్లిదండ్రులపై ప్రోహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ యాక్ట్‌ 2006 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.

శంకరపట్నం: మొలంగూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంతడ్పుల నరేశ్‌(35) హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మరణించినట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. మెట్‌పల్లి గ్రామానికి చెందిన వంగల సంపత్‌రెడ్డి, అంతడ్పుల నరేశ్‌ మొలంగూర్‌ శివారులో ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన శుభకార్యానికి హాజరై ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా.. మొలంగూర్‌ శివారులో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నరేశ్‌ తండ్రి మొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకరికి తీవ్ర గాయాలు

శంకరపట్నం: మొలంగూర్‌లో శనివారం మోటార్‌సైకిల్‌, సైకిల్‌ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కాచాపూర్‌ గ్రామానికి చెందిన శనిగరపు అంజి(25), అనిల్‌ మోటార్‌ సైకిల్‌పై కొత్తగట్టు గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. చింతలపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య సైకిల్‌ను ఢీకొన్నారు. శనిగరపు అంజికి తీవ్ర గాయాలు కాగా.. 108 ఈఎంటీ సతీశ్‌రెడ్డి ప్రథమ చికిత్స చేసి హుజూరాబాద్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement