రామగుండం: రైల్వే ఆస్తుల సంరక్షణ, ప్రయాణికుల భద్రతే ఆర్‌పీఎఫ్ (దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) లక్ష్యమని రామగుండం ఆర్‌పీఎఫ్ సీఐ కొదురుపాక రాజేంద్రప్రసాద్ అన్నారు. ఫిబ్రవరి నెలలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు కనబర్చిందని తెలిపారు. ఈమేరకు శుక్రవారం రైల్వే సీపీఆర్‌వో ఏ.శ్రీధర్ పేర్కొన్న అంశాల ప్రకటన జారీ చేశారు. ఆపరేషన్ యాత్రీ సురక్షలో భాగంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది 43మందిని గుర్తించి 38 కేసులు నమోదు చేసి రూ.17.97 లక్షల సొత్తు రికవరీ చేశామన్నారు. రైళ్లలో పోగొట్టుకున్న రూ.85.21 లక్షల విలువ చేసే 294 వస్తువులను వెతికి పట్టుకొని యాజమానులకు అప్పగించినట్లు తెలిపారు. రైళ్లలో మత్తు పదార్థాల అక్రమ రవాణాలను అరికట్టి రూ.72.37 లక్షల విలువైన గంజాయిని పట్టుకొని 20మందిని అరెస్టు చేశామన్నారు. అలాఏ ప్రయాణాల్లో తప్పిపోయిన 92 మంది పిల్లలను గుర్తించి వారిని సురక్షితంగా గుర్తించి వారిని సురక్షితంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. రూ.1,56,270 విలువైన మద్యాన్ని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను ఎకై ్సజ్ శాఖకు అప్పగించి ఐదు కేసులు నమోదు చేయించడం జరిగిందన్నారు. రైల్వే టికెట్లలో దళారుల అక్రమ విక్రయాలను గుర్తించి 15 మందిని అరెస్టు చేసి 14 కేసులు నమోదు చేసి వీరి నుంచి రూ.95,129 విలువ చేసే 53 టికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రైల్వేస్టేషన్‌లో సీసీ పుటేజీ సహాయంతో నలుగురు నేరస్తులను గుర్తించి వారి నుంచి 30వేల విలువైన ఆస్తులను రికవరీ చేసుకొని వారిని సంబంధిత సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే వారిని గుర్తించి 52 కేసులు నమోదు చేసి రూ.6,77,942 రైల్వే ఆస్తిని రికవరీ చేశామన్నారు. వీటన్నింటిలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది సేవలుంటాయని తెలిపారు.


