ప్రథమస్థానంలో నిలుపుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రథమస్థానంలో నిలుపుదాం

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 7:45 AM

● నగర, పట్టణాభివృద్ధిలో పాలకుల పాత్ర కీలకం ● కౌన్సిలర్లు, కార్పొరేటర్ల శిక్షణలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: నగరం, పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని, అభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో నిలుపుదామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. ‘ప్రజాపాలన– ప్ర గతి ప్రణాళిక’ 90 రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికై న కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వశాఖలు ప్ర జలకు అందించే సేవలు, పథకాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంత బాధ్యతగా ఉంటే ఆ నగరాలు, పట్టణాలు అంతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. నిత్యం శానిటేషన్‌ విధానం పర్యవేక్షించాలని, మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వార్డులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పౌరుల సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి రహిత పాలనతో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతి కార్పొరేటర్‌ డివిజన్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మున్సిపల్‌ చేపట్టే పనులను పర్యవేక్షించాలని కోరారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, కరీంనగర్‌ నగర పాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, ఆర్డీవో రమేశ్‌, హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహాసిని, వైస్‌ చైర్‌ పర్సన్‌ గూడూరి అంజలి, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ ముంతాజ్‌ అలీ మహమ్మద్‌, చొప్పదండి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, వైస్‌ చైర్‌పర్సన్‌ పెరుమాండ్ల మానస, మున్సిపల్‌ కమిషనర్లు సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మనోహర్‌, మహమ్మద్‌ ఆయాజ్‌ పాల్గొన్నారు.

పల్లెల ప్రగతిలో సర్పంచులదే కీలక పాత్ర

తిమ్మాపూర్‌: పల్లెల ప్రగతిలో సర్పంచులే కీలకమని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. తిమ్మాపూర్‌ శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధశాఖల అధికారులు 99 రోజుల కార్యాచరణను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషనన్‌ ద్వారా వివరించారు. 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర నిధులు, ఆదాయ–వ్యయాలు, పథకాల అమలు, ఆర్థిక నిర్వహణపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమస్యల పరిష్కారానికి అవకాశమని తెలిపారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నూతన సర్పంచులు ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌, ఆర్‌డీవో మహేశ్వర్‌, డీపీవో జగదీశ్వర్‌, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీఆర్‌డీవో శ్రీధర్‌, డీఏవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement