పోటెత్తిన ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ప్రజావాణి

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

పోటెత

పోటెత్తిన ప్రజావాణి

● నాలుగు వారాల తరువాత కలెక్టరేట్‌ కళకళ ● ఒక్కో అర్జీదారుది ఒక్కో సమస్య

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజావాణికి అర్జీలు పోటెత్తాయి. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ క్రమంలో నాలుగు వారాలుగా ప్రజావాణి కార్యక్రమం రద్దవగా సోమవారం నుంచి యథావిథిగా కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్‌ ప్రకటించిన విషయం విదితమే. నెల రోజుల తదుపరి కార్యక్రమం జరగడంతో జిల్లా నలుములల నుంచి కలెక్టరేట్‌కు వందల సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు అర్జీలను స్వీకరించారు. మొత్తం 367 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వెల్లడించారు.

సర్వే చేయడం లేదు

మాకు గ్రా మంలోని 169/బి సర్వే నంబర్‌లో 1.19 ఎకరాల పట్టా భూమి ఉంది. మా పక్కన గల వ్యక్తులు అక్రమిస్తున్నారు. సర్వే చేసి మా భూమిని మాకు చూపించాలని ప్రభుత్వ సర్వేయర్‌కు దరఖాస్తు చేస్తే సర్వే చేయడం లేదు.

– డి.జమున, మన్నెంపల్లి, తిమ్మాపూర్‌

తాత్కాలిక సర్టిఫికెట్లేమిటి?

సదరం సర్టిఫికెట్ల జారీలో అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా రు. డబ్బులిచ్చిన వారికి శాశ్వత, ఇవ్వని వారికి తా త్కాలిక సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. మూడేళ్ల పాటు పింఛన్‌ రాగా సర్టిఫికెట్‌ గడువు ముగియడంతో మా అందరికి పింఛన్‌ నిలిపివేశారు. ఇదెక్కడి అన్యాయం. కళ్ల ముందే దివ్యాంగులుగా కనిపిస్తుంటే సర్టిఫికెట్లు అలా ఎలా ఇస్తారు.?

– బాధిత దివ్యాంగులు

ఇసుక అక్రమ రవాణాపై చర్యలుండవా.?

వాగునుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు గ్రామం నుంచి వెళ్తుండగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతుల పొలాలకు ఇబ్బందిగా మారింది. అడ్డుకట్ట వేస్తారా.. మమ్మల్నే అడ్డుకోమంటారా.? – పాలకవర్గం, వన్నారం, రామడుగు

ప్రజావాణికి వచ్చిన అర్జీలు 367

అత్యధికంగా కార్పొరేషన్‌ 41

హౌజింగ్‌ 37

ఆర్డీవో, కరీంనగర్‌ 30

డీపీవో 20

సీపీ 19

ఆర్డీవో, హుజూరాబాద్‌ 17

తహసీల్దార్‌, రామడుగు 16

వారధి సొసైటీ 12

పోటెత్తిన ప్రజావాణి1
1/3

పోటెత్తిన ప్రజావాణి

పోటెత్తిన ప్రజావాణి2
2/3

పోటెత్తిన ప్రజావాణి

పోటెత్తిన ప్రజావాణి3
3/3

పోటెత్తిన ప్రజావాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement