విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

● అడిషనల్‌ కలెక్టర్‌ ఆశ్విని తానాజీ వాకడే

కరీంనగర్‌టౌన్‌: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకున్న అంశాలను నిజజీవితంతో అనుసంధానం చేసుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ఆశ్విని తానాజీ వాకడే సూచించారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్‌ మ్యూజియంలో విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఫోరమ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టెస్ట్‌కు జిల్లాలోని 16 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రథమస్థానంలో కనపర్తి సుశాంత్‌, ద్వితీయస్థానంలో భూంపల్లి కీర్తి(జెడ్పీహెచ్‌ జంగపల్లి), తృతీయస్థానంలో కోమటిరెడ్డి ఆదిత్య నిలిచారు. వీరికి అదనపు కలెక్టర్‌ బహుమతులు అందించారు. శాస్త్రవేత్తల కృషిని స్ఫూర్తిగా తీసుకొని, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి చాడ జయపాల్‌రెడ్డి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ మిల్కూరి శ్రీనివాస్‌, వసుంధర, నాగుల భుజన్‌ చందర్‌, నలుమాచు చంద్రశేఖర్‌, కామిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి, గోరంటల ఆనందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement