కోరుట్ల
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని మినీట్యాంక్ బండ్ అసంపూర్తిగా ఉంది. అమృత్ పథకం కింద ఎంపికై న తాళ్ల చెరువు రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్ పనులు మొదలు కాలేదు. భగీరథ సిస్టం తరచూ దెబ్బతింటుండటంతో ఈ పనులు చాలా అవసరం.
● కోరుట్ల జాతీయ రహదారిపై కూడళ్లు ఇరుకుగా ఉన్నాయి. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
● పట్టణంలో ఒకటే పిల్లల పార్కు ఉంది. మరో పార్కు నిర్మాణం ప్రతిపాదన ఉన్నా ఆ పనులకు మోక్షం లేదు.
● ఏటా వర్షాకాలం వరదలో మునిగిపోతున్న ఝాన్సీరోడ్, ప్రకాశంరోడ్, కలూర్ రోడ్ సమస్యలు తొలగించేందుకు ప్రతిపాదించిన పనులు మొదలు కాలేదు.
● తహసీల్దార్ కార్యాలయం ఊరికి దూరంగా ఉండటంతో సమస్యగా మారింది. కార్యాలయం పనులు కల్లూర్ రోడ్‌లో మొదలైన అర్ధంతరంగా ఆగిపోయాయి.
● పట్టణ శివారు వార్డుల్లో సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు.
● బురుజు, గోదాం రోడ్‌లో కూరగాయాల మార్కెట్లు కొనసాగుతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్తి సదుపాయాలు ఉన్న మార్కెట్ ఏర్పాటు చేయాలి.
● జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కల్లూర్ రోడ్, అయిలాపూర్ రోడ్, మరికొన్ని అప్రోచ్ రోడ్లను విస్తరించే పనులు అవసరం.
● కోరుట్ల చిహ్నాలుగా మిగిలిన పురాతన కోట బురుజుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
కోరుట్ల


