కంపు.. ముంపు ముప్పు!
కరీంనగర్ కార్పొరేషన్:
స్మార్ట్‌సిటీగా ఎంపికై న తరువాత నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్ల రూపురేఖలు మారిపోయాయి. అంతర్గత రోడ్లు, కాలనీల లింక్‌రోడ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎం హామీ పథకం కింద రూ.130 కోట్లతో నగరంలో 60 రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో సగం పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వం మారగానే సంబంధిత కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులు నిలిపివేశారు. ఫలితంగా రెండేళ్ల నుంచి అసంపూర్తి పనులతో ఆయా ప్రాంత ప్రజలు నరకం చూస్తున్నారు.
● నగరంలో కోతులు, కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. కోతులు గుంపులుగా ఇండ్లపైకి వస్తుండడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరుగెత్తుతూ ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇండ్లల్లోకి చొరబడి తినుబండారాలు, నిత్యావసర వస్తువులు పట్టుకెళ్తున్నాయి. ఇక కుక్కల సమస్య నగరంలోని 66 డివిజన్‌లను పట్టిపీడిస్తోంది. రోడ్లపై, నివాసాల నడుమ కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
● నగరం వేగంగా విస్తరిస్తుండగా, అదే స్థాయిలో ట్రాఫిక్‌సమస్యలు పెరుగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం కార్యాలయాల వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. ట్రాఫిక్ సిగ్న ల్స్ శాసీ్త్రయంగా లేకపోవడం వాహనదా రుల ఇబ్బందులకు కారణమవుతున్నాయి. పుట్‌పాత్‌లు,రోడ్ల ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలను మరింత పెంచుతున్నాయి. స్మార్ట్‌సిటీ రోడ్లతో పుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడంతో, అవి కాస్త ఇరుకుగా మారార ుు, పైగా ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలు సాగిస్తుండడంతో వాహనాలు పోవడానికి ఇబ్బందిగా ఉంటోంది. స్మార్ట్‌సిటీ రోడ్లు అక్కడక్కడ నాణ్యత కోల్పోతున్నాయి.
● రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తున్న నగరంగా గుర్తింపు పొందినప్పటికి, నగరపాలకసంస్థ పరిధిలోని చాలా డివిజన్‌లలో నీటి ఎద్దడి నెలకొంది. హౌసింగ్‌బోర్డుకాలనీ రిజర్వాయర్ పరిధిలో 24 గంటల నీటి సరఫరాను ప్రారంభించినప్పటికి, పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. మిగతా రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు తాగునీటి సరఫరా జరగాల్సి ఉండగా, కోతిరాంపూర్, అంబేడ్కర్, కోర్టు రిజర్వాయర్ల పరిధిల్లో రెండు రోజులకో మారు అది కూడా సరిపడా ఫ్రెషర్‌తో రావడం లేదు.
● నగరవ్యాప్తంగా నల్లా పైప్‌లైన్ లీకేజీ నిత్య సమస్యగా మారింది. కమాన్,రాంపూర్,కోర్టు,నాకాచౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు వస్తున్నాయంటే, నల్లా వస్తున్నట్లుగా ప్రజలు తెలుసుకొంటుంటారు. లీకేజీల కారణంగా తాగునీటి కలుషితం ఎక్కువవుతోంది. రోజుల తరబడి పైప్‌లైన్ లీకేజీతో రోడ్లపై నీళ్లు వరదలా పారుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. లీకేజీతో ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమవుతున్నాయి.
● వర్షాకాలం వచ్చిందంటే చాలు, నగరంలోని ముకరాంపుర, శర్మనగర్, ఆర్టీసీ వర్క్‌షాప్, రాంనగర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాలు వరదముంపునకు గురవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ కల్వర్టులు చిన్నగా ఉండడం, పూడిక పేరుకుపోవడం, డ్రైనేజీల లింక్‌లు సక్రమంగా లేకపోవడం లాంటి కారణాలతో వరదనీళ్లు ముందుకు వెళ్లలేక సమీపంలోని ఇండ్లు, చౌరస్తాలను ముంచుతున్నాయి. ముకరాంపురలోని విమానం వీధి ప్రతి సారి వరద ముంపును ఎదుర్కొంటూనే ఉంది. శర్మనగర్, సాహెత్‌నగర్‌లు కూడా వరదప్రభావ తాకిడికి ఇబ్బంది పడుతున్నాయి.
● నగరంలో పారిశుధ్యం నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి,పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లాల్సిన స్వచ్ఛ ఆటోలు కొన్ని డివిజన్లలో సక్రమంగా వెళ్లడం లేదు. రెండు రోజులకు ఒకసారి కూడా వెళ్లని డివిజన్‌లు కూడా ఉన్నాయి. దీనితో పలు డివిజన్‌లలో ఇండ్లల్లో చెత్త పేరుకుపోతోంది. వాణిజ్యపరంగా చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతోనూ, కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించడం సంవత్సరానికి ఒకసారి కూడా జరగని ప్రాంతాలున్నాయి.
● వీధి దీపాల నిర్వహణ నగరంలో సమస్యగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో నిర్వహణ లేక వీధి దీపాలు లేక చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. టవర్‌సర్కిల్, కలెక్టరేట్, హౌసింగ్‌బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ లైట్ల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో అప్పుడప్పుడు అలంకారప్రాయంగా మారుతున్నాయి.
● నగరంలో బస్‌షెల్టర్ల ఏర్పాటులో విచిత్ర పరిస్థితి నెలకొంది. కావాల్సిన చోట్ల షెల్టర్లు లేక, షెల్టర్లు ఉన్న చోట నిరుపయోగంగా ఉంటున్నాయి. బస్‌కోసం ఎదురుచూసే క్రమంలో రోడ్డుపైనే నిలబడడం, లేదా చెట్టునో, షాప్ రేకులనో ఎండ,వానల నుంచి కాపాడుకొనేందుకు ఉపయోగించుకోవాల్సి వస్తోంది.


