బొకేలు, శాలువాలు వద్దు.. నోట్‌బుక్స్, పెన్నులు తెండి
కరీంనగర్: పూల బొకేలు, శాలువాలతో సన్మానాలు చేయవద్దంటూ కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. సన్మానాలకు బదులుగా నోట్‌బుక్స్, పెన్నులు, పరీక్షల ప్యాడులు అందిస్తే విద్యార్థులకు చేయుత అందించిన వారమవుతామని తెలిపారు. శుక్రవారం మేయర్ క్యాంపు కార్యాలయంలో 44వ డివిజన్ నాయకుడు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాజె రమేశ్ మర్యాదపూర్వకంగా కలిసి నోట్‌బుక్స్, పెన్నులు అందించారు. మేయర్ మాట్లాడుతూ పరీక్షల కా లం కాబట్టి నోట్‌బుక్కు, పెన్నులు, ప్యాడ్లు తీసుకొస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. భారతీయ నవజీవన్ పార్టీ జాతీ య అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆడబిడ్డ పెళ్లికి రూ.25వేలు అందజేత
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్‌టౌన్: నగరపాలకసంస్థ ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు ఇచ్చిన హామీని 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ నిలబెట్టుకున్నారు. తాను గెలిస్తే డివిజన్‌కు చెందిన ఆడపిల్ల పెళ్లికి రూ.25 వేలు ఆర్థికసాయం అందజేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌గా విజయం సాధించిన తరువాత మొదటిసారి శుక్రవారం 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి నిర్మల రవీందర్ కుమార్తె అక్షిత వివాహం జరగగా, ఆ పెళ్లికి వెళ్లి ఆడబిడ్డ కట్నం కింద రూ.25వేల నగదు అందజేశారు.
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పి.రవికుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ డిపో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన అకౌంట్స్ ఆఫీసర్‌గా బదిలీపై కరీంనగర్‌కు వచ్చారు.
24న తాగునీటి సరఫరా బంద్
కరీంనగర్ కార్పొరేషన్: నగరవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన తాగునీటి సరఫరా ఉండదని నగరపాలకసంస్థ ఈఈ సంజీవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిల్టర్‌బెడ్ వద్ద 14 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేసే వాల్వ్ చెడిపోయినందున మరమ్మతులు పనులు జరుగుతున్నందున నీటి సరఫరా జరగదన్నారు. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని కోరారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,500 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 44 వాహనాల్లో 368 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,300కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్‌కు సెలవు ఉంటుందని, సోమవారం యథా విధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
బొకేలు, శాలువాలు వద్దు.. నోట్‌బుక్స్, పెన్నులు తెండి
బొకేలు, శాలువాలు వద్దు.. నోట్‌బుక్స్, పెన్నులు తెండి
బొకేలు, శాలువాలు వద్దు.. నోట్‌బుక్స్, పెన్నులు తెండి


