ఎగిరి.. గిర్రున తిరిగి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీఎంకప్–2025 జిమ్నాస్టిక్స్ పోటీలు శుక్రవారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. పోటీలకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలు ప్రారంభించారు. అండర్–12, 14, 15 విభాగాల్లో మూడు రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్పింగులా ఎగిరి.. గిర్రున తిరుగుతూ పోటాపోటీగా ప్రదర్శనలిచ్చారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, యువజన అధికారి రాంబాబు, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా జిమ్నాస్టిక్ సంఘం అధ్యక్షుడు నిరంజనాచారి పాల్గొన్నారు.
ఎగిరి.. గిర్రున తిరిగి


