బావి పూడ్చాలని ఆందోళన
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల మధ్య ఉన్న వ్యవసాయ బావి కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ బావి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రామస్తులు బావి యజ మాని అద్దునూరి సంపత్‌తో మాట్లాడి, బావిని పూడ్చాలని కోరారు. స్పందించకపోవడంతో ఆగ్రహించి బావివద్దే ధర్నాకు దిగారు. కొన్నేళ్లుగా వ్యవసాయ బావితో ఇబ్బంది పడుతున్నామని, అధికారులకు, సర్పంచ్‌కు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే ఎస్సీ కాలనీకి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు విధులకు హాజరుకాబోమని తెగేసి చెప్పారు.
బావి పూడ్చాలని ఆందోళన


