సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు | - | Sakshi
Sakshi News home page

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

సాక్ష

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

లింగ నిర్ధారణ నేరం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఎంపికకు దరఖాస్తులు

కరీంనగర్‌: కరీంనగర్‌ ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం అందుకున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఈ పురస్కారాన్ని అందించారు. జర్నలిజంలో మెరుగైన సేవలకు పురస్కారానికి ఎంపిక చేశారు. అదే విధంగా కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టులు తాడూరి కరుణాకర్‌, ప్రమోద్‌కుమార్‌ పురస్కారాలు అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతు ల మీదుగా ఈ పురస్కారాలు స్వీకరించారు.

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు శివాజీ

కరీంనగర్‌: హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు శివాజీ అని మేయర్‌ కొలగాని శ్రీనివా స్‌ కొనియాడారు. పద్మనగర్‌లో శివాజీ యువ సమితి ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివా జీ మహారాజ్‌ జయంతి వేడుకలు నిర్వహించా రు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చూపిన ధైర్యం, ధర్మం, కరుణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నాయకులు గుంజేటి శివ, శ్రీనివాస్‌, హరికాంత్‌, ఆదిత్య కిరణ్‌, అన్వేశ్‌, మణి, ప్రమోద్‌రావు, సత్తిరెడ్డి, కొమరన్న, అనిల్‌, సదానందం పాల్గొన్నారు.

కరీంనగర్‌: లింగనిర్ధారణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్స్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ తనిఖీ బృందం సభ్యులతో కలిసి గురువారం నగరంలోని పలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్‌లు, అల్ట్రాసౌండ్‌ కేంద్రాలు తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–2010, గర్భస్థ పిండ లింగనిర్ధారణ చట్టం–1994, నిబంధనలు– 1996 మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధ, పీవో డీటీటీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్‌ఎన్‌ సనజవేరియా, బాలయ్య, ఇజాక్‌ పాల్గొన్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): 2026–27 ఏడాదికి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకంలో భాగంగా ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి, జిల్లాలోని ప్రైవేట్‌ ఆంగ్లమాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్‌ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు ఎం.నాగైలేశ్వర్‌ తెలిపారు. పాఠశాలల ఎంపికకు 7వ తరగతి, 10 వ తరగతిలో 90శాతం ఉత్తీర్ణత అందులో 50శాతం ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావాలన్నారు. రెసిడెన్షియల్‌ విద్యార్థులకు ట్యూషన్‌, హాస్టల్‌ వసతి, భోజ న, యూనిఫాం, షూలు, సాక్స్‌కు ప్రతి విద్యార్థికి రూ.42,000 చొప్పున, నాన్‌– రెసిడెన్షియ ల్‌ విద్యార్థులకు రూ.28,000 చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను ఉపసంచాలకుడు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ కరీంనగర్‌ కార్యాలయంలో మార్చి 25 సాయంత్రం లోపు సమర్పించాలని సూచించారు.

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు1
1/2

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు2
2/2

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement