ప్రజలకు పనికిరాని పదవులెందుకు? | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పనికిరాని పదవులెందుకు?

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

ప్రజలకు పనికిరాని పదవులెందుకు?

ప్రజలకు పనికిరాని పదవులెందుకు?

● బీఆర్‌ఎస్‌, బీజేపీలది చీకటి పొత్తు ● సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. బండి సంజయ్‌ని ఎంపీగా గెలి పిస్తే రూపాయి తీసుకురాలేదని, ఎమ్మెల్సీని గెలిపి స్తే ఆయనెవరో ప్రజలకు తెలియదని విమర్శించారు. ఇప్పుడు 30 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే కూడా బీజేపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదన్నారు. నగర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువస్తామని చెప్పే ధైర్యం బండి సంజయ్‌కి ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంగా తాము అభివృద్ధి కొనసాగిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలది చీకటి బంధమన్నారు. బీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందంతో మేయర్‌ స్థానాన్ని కై వసం చేసుకొని, కాంగ్రెస్‌పై బురదజల్లడం బీజేపీకే చెల్లిందన్నారు. అర్బన్‌ బ్యాంక్‌చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్‌, వరాల నర్సింగం, గంట శ్రీనివాస్‌, పర్వతం మల్లేశం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement