స్వభావాన్ని బట్టి సమాధానం | - | Sakshi
Sakshi News home page

స్వభావాన్ని బట్టి సమాధానం

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

  స్వభావాన్ని బట్టి సమాధానం

స్వభావాన్ని బట్టి సమాధానం

స్వభావాన్ని బట్టి సమాధానం

● హిందీలో ముఖ్యంగా స్వీయరచన సృజనాత్మకత అంశాలపై దృష్టి సాధించాలి.

● మొదటి బిట్‌లో పరిచిత, అపరిచిత గద్య, పద్య భాగముల నుంచి అంశాలను ఇచ్చి ప్రతిదానికి 5 ప్రశ్నలిస్తారు. వీటికి 1–15 వరకు ప్రశ్న సంఖ్య కేటాయిస్తారు. ఈ 15 ప్రశ్నలను వీలైనంత వరకు ఒకేచోట వరుస క్రమంలో సంపూర్ణ వాక్య రూపంలో రాయడం ఉత్తమం.

● స్వీయ రచనలో ప్రశ్న స్వభావాన్ని బట్టి సమాధానాలు రాయాలి. ప్రశ్నలచే విధానంలో కారణ్‌ లిఖియే, సృష్ట్‌ కీజియె, సార్థకత పర్‌ ప్రకాశ్‌ డాలియె, సుఝవ్‌ లిఖియె లాంటివి ఎక్కువగా అడుగుతారు.

● లఘు సమాధానం ప్రశ్నలకు 5–6 పంక్తుల్లో, వ్యాసరూప సమాధానాలు 10–12 పంక్తుల్లో రాయడం మంచిది. వ్యాసరూప సమాధానాలు 2, 3 పేరాల్లో విభజించి రాస్తే బాగుంటుంది.

● సృజనాత్మకతలో(ప్రశ్న 22) ఏదేని ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ బిట్‌లో ముఖ్యంగా వార్తాలాప్‌, నారే, సాక్షాకార్‌ కీ ప్రశ్నావళి, పత్ర్‌, నిబంధ్‌, డెయిరీ, పోస్టర్‌, కర్‌పత్ర్‌ల నుంచి ప్రశ్నలు ఉండొచ్చు. నిబంద్‌లో సూక్తులు, నీతివచన్‌, ముహరరేలను జోడిస్తే లాభముంటుంది.

● కవి పరిచయం పేరా రూపంలో రాయడం శ్రేయస్కరం. కవి, జన్మస్థలం, సంవత్సరం, తల్లిదండ్రుల పేర్లు, కవి ప్రత్యేకతలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు. మరణం తదితర అంశాలను క్రమంలో రాయాలి.

– ఉమర్‌ అలీ, హిందీ పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్‌ఎస్‌, గుండి, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement