చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

చేపల

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

పెగడపల్లి: చేపల వేటకు వెళ్లి అక్కడే అస్వస్థతకు గురై ఓ మత్య్సకారుడు మృతిచెందిన సంఘటన మండలంలోని నందగిరిలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నందగిరికి చెందిన తౌవుటు రాజేశం చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం వేకువజామున చెరువులో చేపలు పట్టడానికని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు. రాజేశం భార్య ఫిర్యాదతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి..

వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలం ఎర్రగడ్డలో విషా దం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బానోత్‌ తిరుపతి గురువారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బుధవారం వేములవాడలోని మల్లారం చౌరస్తాలో బైక్‌ స్కిడ్‌ అయి కిందపడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. భార్య రజిత, కొడుకు, కూతురు ఉన్నారు.

వివాహిత ఆత్మహత్య

మానకొండూర్‌: మండలంలోని లలితాపూర్‌కు చెందిన ఓ వివాహిత కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకా రం.. దేవంపల్లికి చెందిన గాడిచెర్ల శారద, రాజు దంపతుల కూతురు అనూష(26)కు లలితాపూర్‌కు చెందిన పొలవేని రాజుతో 2025 జూలైలో వివా హమైంది. గత బుధవారం అనూష దేవంపల్లికి వెళ్లింది. అదే రోజు ఇంట్లో ఫోన్‌ వదిలేసి, బయటకు వెళ్లింది. సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం లలితాపూర్‌ శివారులోని కాకతీయ కాలువ గట్టు వద్ద చెప్పులు కనిపించడంతో గా లింపు చర్యలు చేపట్టారు. రంగపేట శివారులో ని డీబీఎం 6 ఉపకాలువలో మృతదేహం లభ్యమైంది. సీఐ సంజీవ్‌ మృతదేహాన్ని పరిశీలించారు.

తొలితరం సింగరేణి మహిళా కార్మికురాలు మృతి

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ న్యూమారేడుపాక గ్రామానికి చెందిన తొలితరం సింగరేణి మహిళా కార్మికురాలు కొమ్ము(దాడి) పోచమ్మ (92) అనారోగ్యంతో గురువారం చికిత్స పొందుతూ మృతిచెందింది. సింగరేణి ఆర్జీ– 2 ఏరియా ఓసీపీ– 3 విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన ఆమెకు భూ నిర్వాసితురాలి కింద 1972లో సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగిగా అవకాశం కల్పించింది. ఈమె తొలుత గోదావరిఖని జీడీకే– 1 ఇంక్‌లైన్‌, అనంతరం జీడీకే– 9 ఇంక్‌లైన్‌ గనిలో విధులు నిర్వహించి 1994లో ఉద్యోగ విరమణ పొందింది. సింగరేణి సంస్థలో తొలితరం మహిళా ఉద్యోగిగా అడుగుపెట్టిన ఆమె.. మరికొంత మంది భూనిర్వాసితులకు అలాగే మహిళలకు సంస్థలో ఉపాధి కల్పించడం కోసం పోరాటాలు చేసిన ఘనత పోచమ్మకు దక్కింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మృతిపై పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
1
1/2

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
2
2/2

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement