కిసాన్ ధన్ సెంటర్‌లో నాణ్యమైన ఎరువులు
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): నేషనల్ ఫెర్టిలైజర్స్ నుంచి రైతులకు ఎరువులను నేరుగా విక్రయించడానికి ఎన్‌ఎఫ్‌ఎల్ కిసాన్ ధన్ సెంటర్‌ను గురువారం పెద్దపల్లి, చెన్నూరు కేంద్రాల్లో ప్రారంభించామని ఆర్‌ఎఫ్‌సీఎల్ జీఎం, సైట్ ఇన్‌చార్జి రమేశ్‌ఠాకూర్ తెలిపారు. ఎరువుల విక్రయానికి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులకు విక్రయించేందుకు ఎన్‌ఎఫ్‌ఎల్ కిసాన్ ధన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఎరువులను ప్రభుత్వ సబ్సిడీ ధరలలో కిసాన్ ధన్ సెంటర్‌లో రైతులకు అందిస్తామని ఎన్‌ఎఫ్‌ఎల్ స్టేట్ మేనేజర్ రాజేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్‌కుమార్, ఎన్‌ఎఫ్‌ఎల్ ఏరియా మేనేజర్ వంశీకృష్ణరాజు, జిల్లా కోఆర్డినేటర్ తిరుమల ఉన్నారు.


